సంతకం
మాట పందిరి గుంజలా నిలబడడానికి హద్దులు గీసేది పిచ్చికూతలు కాగితం పైకెక్కకుండా జాగ్రత్తలు నేర్పేది మిఠాయి నాలుక కాకరకాయలా మారకుండా చేసేది రాసిన రాతల వలలో బందీని చేసేది ఒక్క సంతకం
మాట పందిరి గుంజలా నిలబడడానికి హద్దులు గీసేది
పిచ్చికూతలు కాగితం పైకెక్కకుండా జాగ్రత్తలు నేర్పేది
మిఠాయి నాలుక కాకరకాయలా మారకుండా చేసేది
రాసిన రాతల వలలో బందీని చేసేది ఒక్క సంతకం
హామీలను కాగితపు పడవలు చేసి నీటిలో వేయకుండా
ఇచ్చిన అప్పును కోర్టు దాకా లాగగలిగేది
శాసనాన్ని శిలాశాసనంగా మార్చేది
నిండుసభలో మాటలకు నిండుతనం చేకూర్చేది
రాతకోతలన్నింటి చివర చేసే ఒకే ఒక సంతకం
సంతకం లేని చెక్కులెన్ని ఇచ్చినా నాలుక గీసుకోలేం
బాండ్ పేపరైతేనేం బంగారు అక్షరాల రాతలైతేనేం
సున్నాల పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా మారని విలువ
వాటి ముందు వేసిన ఒకే ఒక్క అంకెలా సంతకం
పూర్వకాలంలో మాట కోట్ల విలువ చేసేది
అవకాశవాదం జెండా ఎత్తాక బూడిదయ్యాయి నమ్మకాలు
ఇప్పుడైనా ఎప్పుడైనా చెరిగిపోదు సంతకానికి విలువ
ఒక్కసారి అనుభవమైతే, దెబ్బ తగిలితే
ఎన్ని జాగ్రత్తలు చెప్తుందో, ఎన్ని హెచ్చరికలు చేస్తుందో
ఆలోచించుకొని ఆలోచించుకొని ఆచరించమని చెప్పేది
మనుషులుగా చేసే ఒకే ఒక్క సంతకం
– కొమురవెల్లి అంజయ్య 9848005676
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

