ములుగురూరల్, జనవరి 9 : అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా ములుగు మం డలం కాసిందేవిపేటలో శుక్రవారం జరిగింది. కాసిందేవిపేటకు చెందిన పల్లపు రంగయ్య(42) నాలుగు ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా పెట్టుబడికి రూ.2 లక్షల వరకు అప్పు అయింది.
ఆశించినంత దిగుబడి రాకపోవడంతో అప్పు తీర్చే మార్గం కానరాక మ నస్తాపంతో ఈ నెల 5న గడ్డిమందు తాగ గా కుటుంబసభ్యులు ములుగు దవాఖానకు తరలించగా, ప రిస్థితి విషమించడ ంతో ఎంజీఎం తీసుకెళ్లారు. చికిత్స పొందు తూ మృతి చెందడంతో రంగయ్య భార్య ఉమ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.