ఎదులాపురం, సెప్టెంబర్ 25: సాగు కలిసిరాక.. పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. మావల సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన రైతు సామ అశోక్‌రెడ్డి (55) నాలుగు ఎకరాల్లో పంట సాగు కోసం పెట్టుబడులు అప్పుగా తీసుకువచ్చాడు. పంట సరిగా ఎదగకపోవడంతో అప్పులు మీదపడ్డాయి.
వాటిని ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. బుధవారం రాత్రి ఆదిలాబాద్‌లోని హనుమా న్ నగర్లో ఉన్న తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. వెంటనే రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.