బల్మూరు, జనవరి 28 : నాగర్‌కర్నూల్ జిల్లాలో అప్పుల బా ధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రైతు పుట్ట వెంకటయ్య (55)కు నలుగురు ఆడపిల్లలు. వీరిలో ఇద్దరికి వివాహం జరిపించాడు. దీంతో రూ.6 లక్షల వరకు అప్పు అయ్యింది. తనకున్న ఎకరన్నర భూ మిని విక్రయించి అప్పులు తీర్చాలనుకున్నాడు. గ్రామ శివారులో ఉమామహేశ్వర రిజర్వాయ ర్ ఏర్పాటు కానుండటంతో వ్యవసాయ భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి.
ఓ వైపు అప్పులకు వడ్డీ పెరిగిపోవడంతో వాటిని తీర్చేమార్గం కన్పించక మానసికంగా కుంగిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన తోటి రైతులు.. కు టుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తీ సుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉ ద యం మరణించాడు. భార్య ఇందిరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.