న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో అత్యంత నాటకీయమైన ఉద్యోగుల తొలగింపులను బ్లాక్ కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. తన కంపెనీలో ఒకేసారి 40 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్టు ఆయన ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. దీంతో ఆయన కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 6 వేలకు పడిపోయింది.
పదే పదే ఉద్యోగులను తొలగించడం వల్ల నైతికత దెబ్బతింటుందని, పని పట్ల దృష్టి ఉండదని, వినియోగదారుల, వాటాదారుల నమ్మకాన్ని పొందలేమని తెలిపారు. అందువల్ల తాను కఠిన, స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని.. తక్కువ మంది ఉద్యోగులతోనే ప్రస్తుత ఉత్పాదకతను సాధించగలమనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఏఐ ఆధారిత ఆపరేషన్లను ముమ్మరం చేయాలనే ఉద్దేశంతోనే భారీగా ఉద్యోగులను తొలగించినట్టు ఆయన వెల్లడించారు.