న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ ఇండియా.. ప్రీమియం రిటైల్ చెయిన్ నెక్సాను భారీ స్థాయిలో విస్తరించబోతున్నది. 2030-31 నాటికి దేశవ్యాప్తంగా నెక్సా స్టూడియోల సంఖ్యను 700కి పెంచబోతున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు. తన 200 అవుట్‌లెట్‌ను హర్యానాలో శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..కంపెనీ మొత్తం విక్రయాల్లో 25-30 శాతం చిన్నగా ఏర్పాటు ప్రీమియం రిటైల్ అవుట్లెట్ల నుంచి సమకూరుతుండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు.
గడిచిన ఏడాదిన్నరలో ప్రతి మూడు రోజులకు ఒక నెక్సా స్టూడియో(అవుట్లెట్)ను ప్రారంభించినట్టు చెప్పారు. కంపెనీ మొత్తం విక్రయాల్లో నెక్సా నుంచి 40 శాతం సమకూరుతుండగా, మిగతా 60 శాతం అరెనా షోరూంల నుంచి లభిస్తున్నాయని తెలిపారు. చిన్న స్థాయిలో ఏర్పాటు చేయనున్న నెక్సా స్టూడియోల్లో ప్రీమియం అనుభూతి కల్పించనున్నట్టు, ముఖ్యంగా మెట్రోలు, ఈవీ చార్జింగ్ సదుపాయం కూడా ఈ స్టూడియోలో ఉంటుందన్నారు. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన తన తొలి ఈ-విటారా ఎస్యూవీ కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నది.