కల్వకుర్తి రూరల్, జనవరి 1: కుటుంబ పోషణ భారం గా మారడంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నిం చింది. తల్లీకూతురు మరణించగా, కొడుకు చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదకర ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన ప్రకాశ్, ప్రసన్న (38) దంపతులకు కుమారుడు ఆశ్రిత్రాం, కుమార్తె మేఘన (13) ఉన్నారు. ప్రకాశ్ నిరుడు నవంబర్ 13న గుండెపోటుతో మృతి చెందాడు. తర్వాత భార్య ప్రసన్నకు కుటుంబ పోషణ భారంగా మారింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురికాగా గురువారం మధ్యాహ్నం అన్నంలో విషం కలిపి కుమారుడు, కుమార్తెకు ఇచ్చింది. తర్వాత తాను కూడా తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మధ్యాహ్నం తర్వాత ప్రసన్న సోదరుడు చక్రధర్ ఇంటికి వెళ్లగా.. ఆశ్రిత్రాం తేరుకుని డోర్ తీయగా.. అప్పటికే ప్రసన్న, మేఘన పరిస్థితి విషమంగా మారింది. దీంతో వారిని కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రసన్న, మేఘన మృతిచెందారు. ఆశ్రిత్రాంను ప్రైవేట్ దవాఖానకు తరలించారు.