తాండూరు రూరల్, నవంబర్ 13 : హైదరాబాద్‌లో పట్టుబడిన రూ.500 నోట్ల నకిలీ కరెన్సీ మూలాలు వికారాబాద్ జిల్లా తాండూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కోస్గి మండలం గుండుమల్లకు చెందిన కస్తూరి రమేశ్‌తోపాటు తాండూరు పట్టణంలో ఉంటున్న సోదరి రామేశ్వరీతో కలిసి ఈ నకిలీనోట్లను తయారీకి తెరలేపారు.
నకిలీ నోట్లను తయారు చేసి 1:4 చొప్పున పంపిణీ చేసేవారు. కస్తూరి రమేశ్ తన ఇన్‌స్టాగ్రాంలో ఫోన్ నంబర్ ద్వారా ఆకర్షించి, ఒక ఒరిజినల్ రూ.500 నోటుకు నాలుగు నకిలీ నోట్లు ఇచ్చేవాడు. ఇలా ఈ ముఠా ద్వారా నకిలీ నోట్లను పంపిణీ చేసేవారు. ఈ గుట్టును హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు రట్టు చేశారు. ఈ నోట్లతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.