హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే టీచర్లకు ట్యాబ్‌ల పంపిణీ పూర్తయింది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ టెండర్ల ప్రక్రియ సైతం ముగిసింది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ను ట్యాబ్‌లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగా, వచ్చేనెల నుంచి ఆధునిక అటెండెన్స్ విధానానాన్ని అమలుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది.
స్మార్ట్‌ఫోన్/ ట్యాబ్‌లలో యాప్‌ను ఇన్స్టాల్ చేసి, కెమెరా ఆధారంగా స్కాన్ చేయగానే ముఖాలను గుర్తించి దానికదే హాజరు నమోదు చేస్తుంది. ఇప్పటి వరకు రిజిస్టర్లలో అటెండెన్స్ వేసేవారు. కరోనా ముందు వరకు బయోమెట్రిక్ హాజరు అమలుచేశారు. ఆ తర్వాత జియో అటెండెన్స్‌ను అమలుచేసినా.. తర్వాత నిలిపివేశారు. తాజాగా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలుకు చర్యలు చేపట్టారు. గత జూన్‌లో రాష్ట్రంలోని 19 వేల పైచిలుకు పాఠశాలలకు ట్యాబ్‌లను అందజేశారు. వెయ్యిలోపు విద్యార్థులున్న బడికి ఒకటి, వెయ్యి మంది కంటే అధికంగా ఉన్న స్కూళ్లకు రెండు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ ట్యాబ్‌లలో ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను నిక్షిప్తం చేసి, వీటి ఆధారంగా హాజరును నమోదుచేస్తారు.
అమలు ఇలా..