శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 17:56:04

ధరణి’లో ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు

ధరణి’లో ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు

హైదరాబాద్ ‌:  ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై ఉన్న స్టేను హైకోర్టు పొడిగించింది. మధ్యంతర ఉత్తర్వులను జూన్ 21 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ధరణి పోర్టల్‌కు సంబంధించిన దాఖలైన ఏడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదని..రెండు వ్యాజ్యాలను మాత్రమే విచారణ జరుపుతామని ధర్మానసం పేర్కొంది.

మరో ఐదు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు తోసిపుచ్చింది. ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తున్నదని, ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం కావాలని అడ్వకేట్‌ జనరల్ ‌(ఏజీ) హైకోర్టును కోరారు. ఏజీ విజ్ఞప్తి మేరకు స్పందించిన కోర్టు గతంలో ఇచ్చిన స్టేను జూన్‌ 21 వరకు పొడిగిస్తూ  విచారణను వాయిదా వేసింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo