హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఉన్నతాధికారుల వాహనాలకు టోల్‌ట్యాక్స్ మినహాయింపునివ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) కోరింది. శుక్రవారం సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. అధికారిక వాహనాలతోపాటు అద్దె వాహనాలకు సైతం మినహాయింపునివ్వాలని టీజీవో అధ్యక్షుడు ఏ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ సత్యానారాయణ కోరారు. దీంతోపాటు ఉద్యోగులకు రుణమాఫీ చేయాలని కోరుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. రుణమాఫీ మార్గదర్శకాలను సవరించాలని కోరారు.
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): పంచాయతీ సెక్రటరీల క్యాడర్స్ట్రెంథ్ను నిర్ధారణ చేసి పదోన్నతులు కల్పించాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కోరారు. తెలంగాణ పంచాయతీ సెక్రటరీ సెంట్రల్ ఫోరం కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో నిర్వహించారు. 2019లో నియామకమైన జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు రెండేండ్ల ప్రొబేషన్‌ను ప్రకటించాలని, జీవో-317 బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని, కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, రాజు, వెంకటరమణ, శ్రావణ్, సదానందం పాల్గొన్నారు.