హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు(Munugodu) నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు(Excise officials) దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సంస్థాన్ నారాయణపూర్‌లో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాపులను అధికారులు దగ్గరుండి తెరిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో ఉదయం నుండి మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.
కాగా, మా సార్ చెప్పిన టైంకే వైన్ షాపులు తెరవాలి. లేదంటే షాపులు మొత్తానికి మూసేస్తాం అని మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే.
నియోజకవర్గంలో వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంటకు.. పర్మిట్ రూమ్ సాయంత్రం 6 గంటలకు తెరవాలని రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో సంస్థాన్ నారాయణపూర్‌లో తెరిచి ఉన్న వైన్ షాపు నిర్వాహకులపై దాడికి తెగబడి, షాపును ఎమ్మెల్యే కోమటిరెడ్డి అనుచరులు మూసివేయించారు.
దీంతో వైన్ షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు ఉదయం నుంచే మందు బాబుల కోసం దగ్గరుండి షాపులు తెరిపించి ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు మునుగోడులో ఇదే హాట్ టాఫిక్‌గా మారింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ అధికారులు
మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి Vs లిక్కర్ వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు
సంస్థాన్ నారాయణపూర్‌లో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాపులను దగ్గరుండి తెరిపించిన ఎన్… https://t.co/1Nlu5lCdSO pic.twitter.com/Y34oq1vU1X
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2026