రామన్నపేట, జూన్ 15 : కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొంటారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ, దుబ్బాక గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోళ్లు సాగక కేంద్రాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.
రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి విప్ పదవి ఇచ్చింది గాంధీభవన్‌లో కూర్చొని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును విమర్శించడానికే తప్ప రాష్ర్టాభివృద్ధికి కాదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి మెప్పుకోసమే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై అవాకులు చవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు.