Srinivas Goud | యాదాద్రి భువనగిరి : కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రైతు బంధు అమలుపై స్పష్టమైన హామీని నిలబెట్టుకోవాలి. యాదాద్రికి రాగానే రైతు బంధు హామీ గుర్తుకువస్తుంది. గ్రామాల వారిగా కలెక్టర్ నుంచి పూర్తి స్థాయి నివేదిక తీసుకురావాలి. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. అప్పుడే ఎన్నికలకు వెళ్ళాలి. న్యాయ పరమైన చిక్కులకు ప్రభుత్వమే బాధ్యత వ్యవహరించాలి. రూపాయీ ఖర్చు లేని హామీ రిజర్వేషన్ అమలు చేయాలి అని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండ వద్ద రోప్ వే, సకల వసతులు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. టెంపుల్ సిటీలో 200 ఎకరాలు గటంలోనే కేటాయించాం. టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కింద రూ. 2 కోట్లు కేటాయించాం. సినీ పరిశ్రమ తరలిస్తే ఊరుకోం. సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై బాధితులకు న్యాయం చేయాలి. రేపు వచ్చేది మా ప్రభుత్వమే, అన్నివిధాలా ఆదుకుంటాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం కేసీఆర్ హయాంలో పుంజుకుంది.. ఇప్పుడు కుదేలైంది అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Road Accident | భువనగిరి వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
Revanth Reddy | మెదక్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. 40 నిమిషాల పాటు ప్రయాణికులకు నరకయాతన
Harish Rao | ముఖ్యమంత్రి గారూ.. వారి ఆవేదనను అర్థం చేసుకోండి : హరీశ్‌రావు