హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ కపటనాటకాలకు తెర లేపిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. నోట్ల కట్టలు పంచి అడ్డదారిలో గెలిచేందుకు యత్నిస్తున్నదని ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. అన్నిరంగాలను కుదేలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పేందుకు జూబ్లీహిల్స్ ఓటర్లు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, సీఎం రేవంత్రెడ్డి ఎన్ని ఎత్తుగడలు వేసినా జూబ్లీహిల్స్లో ఎగిరేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ధీమా వ్యక్తంచేశారు. గులాబీ పార్టీ గెలుపు కోరుతూ తెలంగాణ ఎన్ఆర్ఐలు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసినట్టు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ వేదికగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతపై వివరించినట్టు తెలిపారు. అదేవిధంగా అనేకమంది ఎన్ఆర్ఐలు డోర్ టు డోర్ తిరిగి ఓట్లు అభ్యర్థించినట్టు వెల్లడించారు.