Harish Rao | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఎక్కడికక్కడ అత్యవసర సేవలు అందించేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. అవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలని.. ప్రత్యేక హెలికాప్టర్లను తెప్పించాలని అన్నారు.
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలలో రాత్రిపూట నిద్రిస్తున్న విద్యార్థులను ఎలుకలు కరవడంతో 14 మంది విద్యార్థులు గాయపడటంతో.. ఆ గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఆదివారం ఉదయం స్పందించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
పూర్తిగా నిండిన చెరువులు, కాలువలు తెగకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆపదలో ఉన్న బాధితులకు సహాయక చర్యలు అందించాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని అంటున్నారని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధికారులకు సెలవులు రద్దుచేసి 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదకరంగా ప్రవహించే వరదల్లో, చెరువులు, కాలువలు వద్దకు ఎవరు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. పోలీసులు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా కాపాడాలని కోరారు.
నల్గొండ జిల్లా దేవరకొండలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి @BRSHarish
హరీష్ రావు కామెంట్స్:
💠 వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
💠 ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడికక్కడ అత్యవసర సేవలందించేందుకు బృందాలు ఏర్పాటు చేయాలి.
💠 అవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలి..… pic.twitter.com/M4L8hDEGAl
— BRS Party (@BRSparty) September 1, 2024