Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యహరిశ్చంద్రునికి తమ్ముడిలాగా బిల్డప్ ఇస్తాడని మాజీ మంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే అని మండిపడ్డారు హరీశ్‌రావు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం రిపోర్టుపై ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హరీశ్‌రావు మాట్లాడారు.
ఉత్తమ్ నిన్న ఇంకో మాట మాట్లాడిండు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ. 11 వేల కోట్లు ఖర్చు పెట్టాం. రాష్ట్రం ఏర్పడే వరకు 32 శాతం ఖర్చు పెట్టినం అన్నాడు. ఆయన బిల్డప్ ఎట్ల ఉంటది అంటే.. సత్యహరిశ్చంద్రునికి తమ్ముడిలాగా బిల్డప్ ఇస్తాడు. సత్యహరిశ్చంద్రుడే దిగి వచ్చిండా..? అబ్బ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా..? అన్నట్టు ఉంటది. ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్లలో పెట్టిన ఖర్చు కేవలం రూ. 3,700 కోట్లు మాత్రమే. నాట్ ఈవెన్ 10 పర్సెంట్. కానీ రూ. 11 వేల కోట్లు చేసిండు అంటడు. అబద్దాలకు కూడా హద్దులు ఉండాలి. ఉమ్మడి రాష్టంలో, ఢిల్లీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆ నాటి కేబినెట్లో ఉత్తమ్ మంత్రిగా ఉన్న తమ్మిడిహట్టికి అనుమతులు తీసుకురాలేదు. సిగ్గు లేకుండా కమీషన్లు తీసుకున్నారు. రూ. 2300 కోట్లు జేబులు నింపుకుని ప్రజలకు అన్యాయం చేశారు. నాలుగేండ్లలో పూర్తి చేశామని చెప్పి తట్టెడు మట్టి తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నాడు
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టినం, 32 శాతం పని చేశామని చెప్పాడు
కానీ 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో పెట్టిన ఖర్చు రూ.3700 కోట్లు మాత్రమే, చేసిన పనులు 10 శాతం… pic.twitter.com/vvSTOVAObT
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2025