Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది అని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు మా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి పైన దాడి, నా క్యాంపు కార్యాలయం, పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన, సునీత లక్ష్మారెడ్డి పైన , మర్రి రాజశేఖర్ రెడ్డిపైన దాడి చేస్తున్నారు అని ఆయన తెలిపారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు.
రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు కరువై హత్యలు, ఎక్కువ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోయింది. చిల్లర మాటలు బంద్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశాడు. ఎవడో దుబాయ్‌లో చనిపోతే మా కేటీఆర్‌కు ఏం సంబంధం. ఆ రిపోర్ట్ నీ దగ్గర ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి ముక్కులో పెట్టుకో. ఈడీ ఎందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడం లేదు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి అండగా ఉంటున్నాడు. కేంద్రంతో సఖ్యతతో ఉంటానని పేరుకే అంటున్నావు, నీ వల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగం జరగలేదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కేటీఆర్ పైన చేసిన ఆరోపణల్లో రుజువు ఉంటే చూపించు లేదంటే కేటీఆర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి. లోకేష్, కేటీఆర్‌ను అర్ధరాత్రి పూట కలిశాడు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అర్ధరాత్రి పోయి కలిసే అలవాటు రేవంత్ రెడ్డికే ఉన్నది, మా కేటీఆర్‌కు లేదు. ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం మేము భయపడం. ఏదో ఒకటి చేసి మా పైన కేసులు పెడితే మేము భయపడతాం అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. మా పై తెలంగాణ ఉద్యమంలో 300 పైగా కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు. మా పైన ఇంటిలిజెన్స్ వ్యవస్థతో రేవంత్ రెడ్డి నిఘా పెడుతున్నాడు, మాకేం కాదు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను రోజూ ట్యాప్ చేస్తున్నాడు. మా వెనుక ఇంటలిజెన్స్ వాళ్ళను పెట్టి ఎక్కడ అంటే అక్కడ తిప్పుతున్నారు. మా చుట్టూ నిఘా పెట్టారు. మా అందరి ఫోన్స్ ట్యాప్ అవుతున్నవి. విలేకరుల ఫోన్ ట్యాప్ చేస్తున్నారా. నా తో విలేకరులు మాట్లాడేది ఎలా తెలుస్తుంది.