Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి తరతరాల ప్రతీక మన బతుకమ్మ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. పూలను, ప్రకృతిని పూజించే గొప్ప పండుగ మన బతుకమ్మ అని ఆయన కొనియాడారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.