Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు పడరాని కష్టాలు పడుతున్నారు. 24 గంటల కరెంట్ బంద్.. రైతుబంధు ఊసే లేదు.. సాగునీటి కష్టాలు.. చివరకు యూరియా బస్తాల కోసం రైతులు అరిగోస పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు వ్యవసాయ సహకార సంఘాల ఆఫీసుల వద్ద బారులు తీరుతున్నారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. యూరియా బస్తాల కోసం పాట్లు పడుతున్నారు. ఈ అవస్థలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు.
జోరు వానలో బారులు తీరాలే.. బస్తా యూరియా కోసం బోరున ఏడవాలే అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నా.. నీకు కన్నీరే మిగిలింది రైతన్నా.. అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రైతుకు ఒక్క యూరియా బస్తానే ఇస్తుండడంతో.. రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి తమ పట్ల కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని రైతులు బోరుమంటున్నారు. రైతులను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. ఇలా రోడ్డున పడేయడం ఏంటని నిలదీస్తున్నారు.
జోరు వానలో బారులు తీరాలే
బస్త యూరియా కోసం బోరున ఏడవాలేకాంగ్రెస్ పాలనలో రైతన్నా..
నీకు కన్నీరే మిగిలింది రైతన్నా..#CongressFailedTelangana #CongressBetrayedFarmers pic.twitter.com/vn85mDyrBU— Harish Rao Thanneeru (@BRSHarish) August 19, 2025