Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించి.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిధారెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్యమాభివందనాలు తెలిపారు. ‘కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
కోటి రూపాయల కన్నా, కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన తెలంగాణ తల్లే మిన్న, బతుకమ్మను తీసేయడం అంటే తెలంగాణ బతుకును అవమానించడమే అని, ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరిస్తూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిధారెడ్డికి హృదయపూర్వక ఉద్యమాభినందనలు తెలుపుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.
‘కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లిని మార్చటం అంటే తెలంగాణ ప్రతీకలను మార్చటమేనని, శిల్పుల గిరాకీ కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు అదే శిల్పులు ‘నాడు కేసీఆర్ ప్రభుత్వంతో ఖర్చుపెట్టించారు..ఈనాడు ఈ ప్రభుత్వంతో ఖర్చుపెట్టిస్తున్నారు’ అని వాపోయారు. తెలంగాణ సాంస్కృతిక సోయిలేనివాళ్లే వెయ్యేండ్ల బతుకమ్మను లేకుండా చేశారని మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.
కోటి రూపాయల కన్నా, కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన తెలంగాణ తల్లే మిన్న, బతుకమ్మను తీసేయడం అంటే తెలంగాణ బతుకును అవమానించడమే అని, ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరిస్తూ..
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిధారెడ్డి గారికి హృదయపూర్వక ఉద్యమాభినందనలు.#JaiTelangana
— Harish Rao Thanneeru (@BRSHarish) December 11, 2024
ఇవి కూడా చదవండి..
Nandini Sidda Reddy | అందుకే పురస్కారాన్ని తిరస్కరించిన.. ప్రముఖకవి నందిని సిధారెడ్డి..!
KTR | నందిని సిధారెడ్డి ఉదాత్త నిర్ణయం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణం : కేటీఆర్