Harish Rao : సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనాథ విద్యార్థులకు తిండిపెట్టలేని స్థితిలో ఈ దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉన్నదని ఆయన విమర్శించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్ధిపేటలో ఆనాథ విద్యార్థులతో మాట్లాడేందుకు హరీశ్‌రావు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంపై విమర్శలు వర్షం గుప్పించారు.
గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల విద్యార్థుల మెస్ బిల్లులు, కాస్మటిక్ చార్జీలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. రేవంత్ సర్కారు కమిషన్ల సర్కారు అని, కమిషన్లు లేకుండా ఏ పనీ చేయడం లేదని ఆరోపించారు. విద్యార్థులు కమిషన్లు ఇచ్చుకోలేరు కాబట్టే మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు పెండింగ్‌లో పెట్టినట్టున్నరని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలను వెంటనే చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
సీఎం గ్రీన్ ఛానెల్ పెట్టి విద్యార్థులకు బిల్లులు ఇప్పిస్త అన్నడని, కానీ ఇంతవరకు బిల్లు ఇవ్వలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతయని, చేతలు మాత్రం గడప కూడా దాటవని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోతే తోలు వలుస్తా, తోడ్కలు తీస్తా అని రేవంత్‌రెడ్డి గొప్పలు మాట్లాడిండని, అయినా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. ‘నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే విద్యాశాఖ మంత్రివి.. అయినా మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నయ్. మరె ఇప్పుడు ఎవరి తోడ్కలు తియ్యాలె..?’ అని ప్రశ్నించారు.
చిల్లర మాటలు మాట్లాడుతూ విద్యార్థులకు సరిగా భోజనం పెట్టని సీఎం రేవంత్‌రెడ్డిని చెట్టుకు కట్టేసి, లాగులో తొండలు జొరగొట్టాలని హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి తోడ్కలు తీసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. కేసీఆర్ గంట ప్రెస్ మీట్ పెడితే.. సీఎంకు, కాంగ్రెస్ నేతలకు లాగులు తడుస్తున్నయని ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వ తీరుపై ప్రెస్మీట్లో కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా రేవంత్‌రెడ్డి, ఆయన పార్టీ నేతలు సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు.