Harish Rao | హైదరాబాద్ : తమ్మిడిహట్టి వద్ద అగ్రిమెంట్ జరిగి ఉంటే.. ఏడెండ్లు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి ఎత్తలేదని ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం రిపోర్టుపై ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హరీశ్‌రావు మాట్లాడారు.
2007 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తమ్మిడిహట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు. ఇప్పుడు కూడా రెండేండ్లు అవుతుంది. తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మంట్టి ఎందుకు ఎత్తలేదు. ఏ బేసిస్‌లో నిర్ణయించారు. నీటి లభ్యత లేదు. మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు తమ్మిడిహట్టి వద్ద. మేడిగట్ట మీద మేం పెట్టేందుక ఒక బేసిస్ ఉంది. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు, నాటి నుంచి నేటి వరకు గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు. మహారాష్ట్రతో కేసీఆర్ నీళ్లు ఇచ్చి పుచ్చుకునే ఒక చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేము 152 మీటర్లకు తమ్మిడిహట్టి వద్ద అగ్రిమెంట్ చేస్తే మీరు ఎలా తగ్గిస్తారని మాట్లాడాడు. దానికి కేసీఆర్ మాట్లాడుతూ నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినట్టు నిరూపిస్తే నేను ఇంటికి పోకుండా, నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడని హరీశ్‌రావు గుర్తు చేశారు.
కేసీఆర్ ఓపెన్ ఛాలెంజ్‌కు ఇంత వరకు స్పందన లేదు. నిజంగా తమ్మిడిహట్టి వద్ద అగ్రిమెంట్ ఉంటే తట్టెడు మట్టి కూడా ఎందుకు తవ్వలేదు. అంటే అబద్దపు మాటలు. నాడు బీఆర్ఎస్ హయాంలో మంచి పని జరుగుతుంటే అబద్దాలు చెప్పి అనుమానాలు సృష్టించారు. ఇప్పుడు కూడా ప్రజలకు ఉపకారం చేయకుండా ప్రతిపక్షం మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. మేం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే విద్యుత్ సమస్యను పరిష్కారం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించాం. మీడియం ఇరిగేషేన్ ప్రాజెక్టులను పూర్తి చేశాం. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. మరి నువ్వు ఏం జేసినవ్, ఒక్క కాల్వ తవ్వలేదు, ఒక్క చెక్ డ్యామ్ కట్టలేదు, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. కేసులు పెట్టుడు.. కమీషన్లు వేసుడు తప్ప నీళ్లు ఇవ్వలేదు. కానీ ఈ రెండేండ్లలో మాత్రం ఢిల్లీకి కమీషన్ల మూటలు తీసుకెళ్లావు. ప్రతిపక్షాల మీద కమీషన్లు వేశావు ఎలక్ట్రిసీటీ, కాళేశ్వరం కమీషన్లు. శ్వేతపత్రాల నుంచి కమీషన్ల దాకా బద్నాం చేసే కుట్ర చేశావు. వచ్చే రెండేండ్లు కూడా ఇలానే ఉంటుంది. చేసిందేమీ లేదు.. చేయగలిగిందేమీ లేదు. దీన్ని బట్టి చూస్తుంటే.. స్పష్టంగా అర్థమవుతుంది. కాళేశ్వరంను పడావు పెట్టాలి.. బనకచర్లకు నీళ్లు జారగొట్టాలి ఇది కనబడుతుంది. ఎన్డీఎస్ఏ చెప్పింది.. మేడిగడ్డలో రెండు పిల్లలర్లు కుంగిపోయాయి. సెవెన్త్ బ్లాక్ మళ్లీ కట్టి వాడమని చెప్పింది. నువ్వు కట్టవు.. ఎందుకంటే కిందకు నీళ్లు జారాలి. గురువుకు గురు దక్షిణ చెల్లించాలి ఇదే రేవంత్ ధ్యేయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మహారాష్ట్రతో కేసీఆర్ నీళ్లు ఇచ్చి పుచ్చుకునే ఒక చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేశారు
ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేము 152 మీటర్లకు అగ్రిమెంట్ చేస్తే మీరు ఎలా తగ్గిస్తారని మాట్లాడాడు
దానికి కేసీఆర్ మాట్లాడుతూ నువ్వు
152 మీటర్లకు అగ్రిమెంట్… pic.twitter.com/qMuYr8OUaT— Telugu Scribe (@TeluguScribe) August 5, 2025