Harish Rao | హైదరాబాద్ : నిన్న మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్న సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంపై హరీశ్‌రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు ఈ సమావేశం కొంత బాధతో దుఖంతో పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్. రైతు రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్న వంచన, దుర్మార్గ పద్ధతులపై, అన్నదాతల పట్ల ఆవేదనతో మాట్లాడుతున్నాను. నిన్న రైతు సురేందర్ రెడ్డి రుణమాఫీ జరగలేదని ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఉరేసుకున్నాడు. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేంద్ రెడ్డి ఆత్మహత్య. ఆయన తన సూసైడ్ నోట్లో స్పష్టంగా రాశారు. బ్యాంక్ పాస్ బుక్ మీదనే సూసైడ్ నోట్ రాశారు. నా చావుకు కారణం క్రాప్ లోన్ మాఫీ కాకపోవడం. నా చావుకు కారణం క్రాప్ లోన్ చిచ్చు. సురేందర్ రెడ్డితో పాటు ఆయన తల్లి.. ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల రుణమాఫీ కావడం లేదు. ఇద్దరికి క్రాప్ లోన్ ఉంది. రేషన్ కార్డు ఒకటే ఉండడంతో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని అన్నారట బ్యాంక్ మేనేజర్. దాంతో తీవ్ర కలత చెంది సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని హరీశ్‌రావు తెలిపారు.
సురేందర్ రెడ్డి తల్లి సుశీల పేరు మీద 2 ఎకరాల పాస్ బుక్ ఉంది. ఆమెకు రూ. 1,15,662 లోన్ ఉంది. సురేందర్ రెడ్డికి 4 ఎకరాలు.. ఆయన పాస్ బుక్ మీద రూ. 1,92,443 రుణం ఉంది. నాలుగు రోజుల క్రింత ఏపీజీవీబీ బ్యాంక్ వెళ్లి రుణమాఫీ ఎందుకు కాలేదని మేనేజర్‌ను అడిగారు. ఒకే రేషన్ కార్డు ఉండడంతో ఒక్కరికి రుణం మాఫీ అవుతుంది. ఇద్దరికి కలిపి 2 లక్షలు మాఫీ అవుతుంది. మిగతా రుణం చెల్లించాలని బ్యాంక్ మేనేజర్ అనిరుధ్ సురేందర్ రెడ్డికి చెప్పారట. దాంతో మానసికంగా కలత చెందిన సురేందర్ లక్షా 10 వేలు కట్టాలని కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. చివరకు మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఉరేసుకుని చనిపోయారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఈ సూసైడ్ నోట్ సాక్షిగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా.. పంద్రాగస్టు నాడు రుణమాఫీ అయిపోయిందని చెప్పావు..? అయిపోతే సురేందర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. మీరే చెప్పారు కదా రేషన్ కార్డుతో లింక్ లేదని. రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే.. రేషన్ కార్డుతో లింక్ లేదని కొద్ది గంటలకు చెప్పారు. కానీ లింక్ ఉన్నది.. కాబట్టే బ్యాంక్ మేనేజర్లు రేషన్ కార్డు ప్రకారం రుణమాఫీ చేశారు. అందుకే సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదని స్పష్టమవుతుంది. రుణమాఫీ లబ్దిదారులను ఆంక్షల పేరుతో వేధిస్తున్నవ్. నీవు పన్నిన పన్నాగం రైతుల మెడకు ఉరి తాడైంది. రాజకీయంగా బ్లప్ చేద్దామనుకున్నావ్.. నీ బ్లప్కు మూల్యం సురేందర్ రెడ్డి మరణం. సురేందర్ రెడ్డి నోట్లో ప్రతి అక్షరం నీ దురాగాతన్ని, నీ రాజకీయ దివాళకోరుతనాన్ని, నీ నగ్న స్వరూపాన్ని ఇవాళ బజారులో నిలబెట్టిందని చెప్పక తప్పదు. ఈ సూసైడ్ నోట్ నీ దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | డియర్ రేవంత్ రెడ్డి గారు.. ఈ విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు : కేటీఆర్
Peacocks | శ్రీశైలం ఘాట్ రోడ్డులో నెమళ్ల నృత్యం.. ఆ మయూరాల నర్తనకు పర్యాటకులు ఫిదా
Jagadish Reddy | పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ : జగదీష్ రెడ్డి