Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కొనియాడారు. కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారని పేర్కొన్నారు. ఇతరులు అధికారం వెంటబడితే.. కేసీఆర్ మన జీవితాలను మార్చారు. కాంగ్రెస్ కుట్ర గానీ, విచారణ కమిషన్ గానీ కేసీఆర్ ఘనతను తుడిచిపెట్టలేవు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు సాటిలేనివి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. చివరగా జై తెలంగాణ.. జై కేసీఆర్ అని నినదించారు.
From achieving Telangana statehood to delivering transformative projects like Kaleshwaram, KCR’s commitment to the people has been unwavering.
While others chase power, he changed lives.
Congress conspiracy or enquiry commission can’t erase his legacy.
His sacrifices for…
— Harish Rao Thanneeru (@BRSHarish) June 11, 2025