Harish Rao | హైదరాబాద్ : నిండు శాసనసభను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. తాను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్‌గా ఉన్న సమయంలోనే మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు జరిగిందని ఈరోజు సభలో చెప్పుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, తాను ఆ రద్దును వ్యతిరేకిస్తూ అది అన్యాయమని, రాజ్యంగ విరుద్ధమని అసమ్మతి నోటు ఇచ్చిన విషయాన్ని దాచి పెట్టారు. తాను ఇచ్చిన అసమ్మతి నోట్లో మహువా మెయిత్రాను వ్యక్తిగత ద్వేశం, ప్రతీకార చర్యల్లో భాగంగానే ఎక్స్ పెల్ చేసారని సైతం పేర్కొన్నాడని హరీశ్‌రావు తెలిపారు.
నాడు గవర్నర్‌పై దాడి చేసిన విషయంలో ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలను ఎక్స్ పెల్ చేసిన సందర్భంలోనూ అది తప్పుడు చర్య అని, ఈ విషయంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తమని పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ మాట్లాడారు. నాడు స్పీకర్, ముఖ్యమంత్రి వారి విధులను సరిగ్గా నిర్వహించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించాడు. నేడు ఆ మాటలను కూడా దాచి పెట్టారు. ఒకవైపు తాను వ్యతిరేకించిన వాటినే నేడు ఉదాహరిస్తూ మరోవైపు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలనడం మీ కక్ష్య సాధింపు, ఉద్దేశ్య పూర్వక చర్యలను ప్రతిబింబిస్తున్నది. ప్రతిపక్షంలో ఉండగా ఒక తీరు,
అధికారంలోకి రాగానే మరొక తీరు. నాడు తప్పు అనిపించింది, నేడు ఒప్పు ఎలా అనిపిస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారూ.. అని హరీశ్‌రావు నిలదీశారు.