Harish Rao | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ సోలో డెసిషన్ తీసుకున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఆరోపణలను మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం రిపోర్టుపై ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హరీశ్‌రావు వాస్తవాలను బయటపెట్టారు.
సోల్ డిషీజన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని నిన్న ఏదో చూపించారు. ఎంత ఫేక్ అంటే. ఇదంతా కూడా కడిగేస్తాం.. దుమ్ము దులిపేస్తాం. వాళ్లు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైమ్ ఇవ్వాలి. మైక్ కట్ చేసి మీరు పారిపోతారు. రేవంత్ ప్రభుత్వానికి ఇది అలవాటు.. మరిన్ని ఆధారాలు ఉన్నాయి బయటపెడుతామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం రివ్యూ చేయడం అనేది సీఎం బాధ్యత. ఆ సీఎం రివ్యూ చేయకపోతే తప్పు.. చేస్తే తప్పా..? ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి.. నీళ్లు ఇవ్వాలని తపనపడిన వ్యక్తి కనుక రాత్రింబవళ్లు కష్టపడి త్వరగా పూర్తి చేయాలని రివ్యూ చేశాడు. కానీ సోల్ డిసీజన్ అని చెప్పారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలు వాప్కోస్ డీపీఆర్, హై పవర్ కమిటీ సిఫార్సులు, కేబినెట్ నిర్ణయం, సీడబ్ల్యూసీ ఆమోదం మేరకే జరిగాయి. ఇవన్నీ స్పష్టంగా ఉంటే సోల్ డిసీజన్ అని తప్పుడు ఆరోపణ కుట్రపూరితంగా చేశారు. బ్యారేజీల నిర్మాణం వ్యక్తుల నిర్ణయం అనేది పచ్చి అబద్దం. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన, కుట్ర పూరితమైన ఆరోపణే అని హరీశ్‌రావు మండిపడ్డారు.
తమ్మిడిహట్టి వద్ద మీరు తప్పుడు పని చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా తప్పు చేశారు. మేడిగడ్డకు కేబినెట్ అప్రూవల్ లేదని సీఎం, మంత్రులు చేస్తున్న ఆరోపణలు శుద్ధ అబద్ధం. సీడబ్ల్యూసీ సూచన మేరకు ప్రాజెక్టును పునర్ పరిశీలించమని వ్యాప్కోస్ సంస్థను కోరడం జరిగింది. దీనిని 2016 జూన్ 14న కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్‌కు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్కోస్‌కు అప్పగించింది కాబట్టి, మరోసారి వ్యాస్కోస్ సంస్థకే తెలంగాణ కూడా అప్పగించింది అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ సోలో డెసిషన్ తీసుకున్నారని వస్తున్న వార్తలను ఖండించి వాస్తవాలను బయటపెట్టిన హరీష్ రావు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలు వాప్కోస్ DPR, హై పవర్ కమిటీ సిఫార్సులు, కేబినెట్ నిర్ణయం, CWC ఆమోదం మేరకే జరిగాయి
బ్యారేజీల నిర్మాణం వ్యక్తుల… pic.twitter.com/7YOv2zwr42
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2025