Harish Rao | జహీరాబాద్‌లో రైతుల అరెస్టు.. తీవ్రంగా ఖండించిన హరీశ్‌రావు
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.
Harish Rao | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి పర్యటన జరిగిన ప్రతిసారీ ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు? ఇదేనా ప్రజాపాలన అంటే? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
మొన్న నాగర్‌కర్నూల్ పర్యటనలో చెంచు సోదరులను అక్రమంగా అరెస్టు చేశారు. నేడు జహీరాబాద్‌లో రైతులను, రైతు నాయకులను అరెస్టు చేశారు. జహీరాబాద్ నిమ్స్ చుట్టూ ఉన్న గ్రామాలను అష్ట దిగ్బంధనం చేసి, రైతు నాయకులను నిర్బంధించడం ఏ విధంగా ప్రజాపాలన అవుతుంది? ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే పాలన. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన ఆవేదనను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. ఈ హక్కును హరించడం దుర్మార్గం. నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు, అరెస్టులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటన జరిగే పరిస్థితి లేదు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను, రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ డీజీపీని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.@revanth_anumula పర్యటన జరిగిన ప్రతిసారీ ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు? ఇదేనా ప్రజాపాలన అంటే?
మొన్న నాగర్‌కర్నూల్ పర్యటనలో చెంచు సోదరులను అక్రమంగా అరెస్టు చేశారు. నేడు జహీరాబాద్‌లో… pic.twitter.com/DcIDe1CpNS
— Harish Rao Thanneeru (@BRSHarish) May 23, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

