Harish Rao | హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం హాలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియట్‌కు పిలుపు ఇచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అప్రజాస్వామీకం అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీని వెంటనే నిలుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.