Harish Rao | సిద్దిపేట : సిద్దిపేట రామాలయంలో సీతారామచంద్ర స్వామి కళ్యానోత్సవంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు హరీశ్‌రావుకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడతూ.. రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నది. సిద్దిపేటలోని రాముల వారి ఆలయంలో కల్యాణానికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. ఆ సీతారామచంద్ర ఆశీస్సులతో ఈ దేశం, రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని.. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ.. వారికి మంచి పాలన అందించే విధంగా రాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను అని హరీశ్‌రావు పేర్కొన్నారు.