Harish Rao | హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారణ ముగిసింది. ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను కమిషన్‌కు హరీశ్‌రావు వివరించారు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ అభ్యంతరాల వల్లే రీడిజైనింగ్ చేసినట్లు హరీశ్‌రావు చెప్పారు. సుమారు 45 నిమిషాల పాటు హరీశ్‌రావు విచారణ కొనసాగింది.
విచారణకు ముందు కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్ చేరుకున్న హరీశ్ రావు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అనంతరం బీఆర్కే భవన్‌కు బయల్దేరారు. హరీశ్‌రావుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.