Harish Rao | హైదరాబాద్ : నోరు పారేసుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రాజీనామా చేస్తానన్న సన్నాసి.. ఎక్కడ దాక్కున్నవ్.. అని రేవంత్ రెడ్డి అంటున్నారు. నేను ఎక్కడ దాక్కోలేదు.. నేను గుండెల్లో దాక్కున్నా.. నీ గుండెల్లో నిద్రపోతున్నా.. రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు సింహంలా గర్జించారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాజీనామా చేస్తా అన్న సన్నాసి ఎక్కడ దాక్కున్నావ్.. అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు.. నేను ఎక్కడ దాక్కున్నా.. నేను నీ గుండెల్లో దాక్కున్నా.. నీ గుండెల్లో నిద్ర పోతున్నా.. నీకు నిద్ర పట్టనివ్వకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ.. నీ మెడలు వంచి సగం రుణమాఫీ చేయించాను రేవంత్ రెడ్డి. మిగతా సగం రుణమాఫీ చేసేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటాను. ఎక్కడుంటా.. నీ గుండెల్లో నిద్ర పోతుంటా.. అడుగడుగనా నిలదీస్తాను.. రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్ర పోతా.. నిన్ను విడిచి పెట్టలేదు.. నీ వెంట పడుతా అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
ఒక వేలు మమ్మల్ని చూపిస్తే రెండు వేలు మిమ్మల్ని చూపిస్తాయి. రైతుల కళ్లల్లో ఆనందం చూశాడట రేవంత్ రెడ్డి.. కానీ రుణమాఫీ జరగక, రైతుభరోసా అందక రైతులు కళ్లల్లో కన్నీళ్లు వస్తున్నాయి. రైతు భరోసా ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నావు. దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పుడేమో సన్నాలకే మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నవ్. బోనస్‌ను బోగస్ చేసి రైతులను మోసం చేసిన సన్నాసి ఎవడు అని అడుగుతున్నా..? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు.
ఇవి కూడా చదవండి..