Harish Rao | హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును పోలీసులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లోనే ఉంచారు. హరీశ్‌రావు గచ్చిబౌలి పీఎస్‌కు తరలించి దాదాపు మూడు గంటలు కావొస్తుంది. పోలీసు స్టేషన్లోనే ఉన్న హరీశ్‌రావుకు మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గచ్చిబౌలికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది నాయకులను అడ్డుకుని, అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు పోలీసులు. ఇక అక్రమంగా అరెస్టు చేసిన హరీశ్‌రావును తక్షణమే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. హరీశ్ రావు అరెస్టును ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మర్రి జనార్ధర్ రెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, పల్లె రవికుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవి ప్రసాద్, గోసుల శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ చైర్మెన్లు, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | బీఆర్ఎస్ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా : ఎమ్మెల్సీ కవిత
Harish Rao | హరీశ్‌రావు అరెస్ట్.. సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం