Harish Rao | సిద్దిపేట : కొండాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు అరెస్టును నిరసిస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీశ్‌రావును వెంటనే విడుదల చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఇక కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. హరీశ్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసుల బలవంతంగా కారులో ఎక్కించారు. అనంతరం హరీశ్ రావును కౌశిక్ రెడ్డి నివాసం నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
KTR | ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులా..? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం