తొర్రూరు/కొడకండ్ల, ఏప్రిల్ 11 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి లక్షలాదిగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలకేంద్రంలోని సాయి గార్డెన్, జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశాల్లో ఎర్రబెల్లి పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
సభను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ చేసిన మంచి పనులే పార్టీకి శ్రీ రామరక్ష అని, ప్రజలు బీఆర్ఎస్ సర్కారునే మళ్లీ కోరుకుంటున్నట్టు స్పష్టంచేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని చెప్పారు.