హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎలా కల్పించారో బీజేపీ చెప్పాలని, వాటిని వెంటనే రద్దుచేసి బలహీనవర్గాలకు పంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.