హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా పరిగి దాస్యా నాయక్‌తండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేదర్ విగ్రహావిషరణ కార్యక్రమానికి మైక్ పర్మిషన్ నిరాకరించడం దారుణమని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ఇది ఉగాండాలో నియంత ‘ఈదీ అమీన్’ పాలనను గుర్తుకు తెస్తున్నదని ఎక్స్‌వేదికగా విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతీ పౌరునికి ఇచ్చిందన్న కనీస అవగాహన లేని అజ్ఞానుల చేతిలో తెలంగాణ బందీ కావడం దురదృష్టమని పేర్కొన్నారు.
కేటీఆర్ హాజరయ్యే అంబేదర్ విగ్రహావిషరణ కార్యక్రమంలో మైక్‌కు అనుమతి నిరాకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ‘ప్రజాపాలన అని ఊదరగొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం.. హైదరాబాద్‌లోని అత్యంత ఎత్తైన అంబేదర్ విగ్రహ నిర్వహణలో వివక్ష చూపుతున్నది. పరిగిలో అంబేదర్ విగ్రహావిష్కరణలో అడ్డంకులు సృష్టిస్తున్నది’ అని ఎక్స్ వేదికగా విమర్శించారు.