కందుకూరు, ఏప్రిల్ 6: ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గం పరిధిలోని కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం ఉట్లపల్లిలో సీతారామలక్ష్మణ, ఆంజనేయ, శ్రీ శివపార్వతీ, నందీ గణపతి, సుబ్రహ్మణ్య, నాగ, నవగ్రహ, ధ్వజస్తంభ, శిఖర దేవతా విగ్రహప్రతిష్ఠా కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. సబితా ఇంద్రారెడ్డికి వేద పండితులతో పాటు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలని, భగవంతుని కృపకటాక్షాలు ఉట్లపల్లి గ్రామం, నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సీతారామలక్ష్మణ, ఆంజనేయ, శ్రీ శివపార్వతీ, నందీ గణపతి, సుబ్రహ్మణ్య, నాగ, నవగ్రహ, ధ్వజస్తంభ, శిఖర దేవతా విగ్రహప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. భగవంతుని కృప ప్రజలపై ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పురాతన దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమకు తీరిన సమయంలో దేవాలయాలకు వెళ్లాలని సూచించారు.