‘మన కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వం ఎప్పుడూ దృష్టిసారిస్తూనే ఉంటుంది. అందుకే దేశమంతా ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్లు అందిస్తున్నామని సగర్వంగా చెప్తున్నాను’ ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ 15 ఆగస్టు 2020 నాడు ఎర్రకోట సాక్షిగా చేసిన ప్రసంగం. కానీ, నేటికీ దేశంలోని 50 శాతం మందికి పీరియడ్స్ సమయంలో పాత బట్టలే దిక్కు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 69 శాతం మందికి శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేవు. దేశానికే రోల్‌మోడల్ అని మోదీ భజన బృందమంతా చెప్తున్న గుజరాత్లో 51 శాతం మందిది చెప్పుకోలేని అవస్థ!. ఇది మోదీ అంటే గిట్టనోళ్లు అంటున్న మాట కాదు. స్వయానా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెప్తున్న సత్యం. సర్వే ప్రకారం.. ఆ విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శం.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నది. కానీ, నేటికీ దేశంలోని 50 శాతం మందికి శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేవు. ఇది ముమ్మాటికీ దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. అరచేతిలోకే ప్రపంచం వచ్చి చేరిన ఈ దశలోనూ శానిటరీ ప్యాడ్ల గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు. రుతుక్రమ పరిశుభ్రత గురించి అధికశాతం జనాభాకు తెలియట్లేదు. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఈ ముఖ్యమైన సమస్యపై చాలామందికి కనీస పరిజ్ఞానం లేదు. దేశంలోని మహిళలకు అవగాహన కల్పించడంలో కేంద్రం ఘోరం గా విఫలమైంది. ఇటీవల ఓ ఐఏఎస్ అధికారి శానిటరీ ప్యాడ్ల గురించి అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది. అసలు దేశంలోని ఎంతమందికి రుతుస్రావం గురించి తెలు సు? ఏఏ రాష్ర్టాల్లో ఎంత అవగాహన ఉన్నది? ప్రజల్లో చైతన్యమెంత? అనే విషయాలపై చర్చ జరుగుతున్నది.
50 శాతం మందికి పాత వస్ర్తాలే దిక్కు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 డాటా ప్రకారం దేశంలోని 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్న 50 శాతం మందికి శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేవు. ఈ వయస్సులో 50 శాతం మంది యువతులు పాత వస్ర్తాలను ఉపయోగిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితి మరింత దుర్భరంగా ఉన్నది. ఉత్తరప్రదేశ్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది. దేశంలో పీరియడ్స్ సమయంలో అత్యధికంగా యువతులు వస్ర్తాలను ఉపయోగిస్తున్న రాష్ర్టాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌దే మొదటిస్థానం. ఆ రాష్ట్రంలో 69 శాతం మంది పాతబట్టలనే ఉపయోగిస్తున్నారు. రెండోస్థానంలో అస్సాం, మూడోస్థానంలో కాంగ్రెస్ పాలిత ఛత్తీడ్గఢ్ ఆ తర్వాత బీహార్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. శానిటరీ ప్యాడ్లపై ఎక్కువ అవగాహన కలిగిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. దేశంలోనే ఎక్కువ శాతం మంది శానిటరీ ప్యాడ్లు వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో కేవలం 17 శాతం మంది మాత్రమే శానిటరీ ప్యాడ్లకు బదులుగా వస్ర్తాలు ఉపయోగిస్తున్నారు.
ఆమె భవిష్యత్తుకే ప్రమాదం
పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్లకు బదులుగా పాత బట్టలు వాడితే యువతుల భవిష్యత్తుకే ప్రమాదమని సీనియర్ గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. అలర్జీ, దద్దుర్లు వంటివి రావొచ్చని, తరచూ యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదమున్నదని చెప్తున్నారు. సెప్టిసిమియా లేదా టాక్సిక్ షాక్ సిండ్రోమ్ సహా అనేక వ్యాధులు వచ్చే అవకాశమున్నదని పేర్కొంటున్నారు. వ్యాధులు విజృంభించడానికి రక్తం ఎంతో అనువైన ప్రదేశమని, అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శానిటరీ ప్యాడ్లు కూడా ఓ నిత్యావసరమే అనే పరిజ్ఞానం కేంద్రంలోని పెద్దలకు లేకపోవడం మన దౌర్భాగ్యం.
సర్వేలో ముఖ్యాంశాలు