హైదరాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ): ప్రాణహిత నుంచి వృథాగా పోతున్న జలాలను కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఉన్నదని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. ‘ఎల్ నినో ప్రభావం ఉన్నది కాబట్టి అన్నారం, సుందిళ్ల బరాజ్‌లో నీళ్లు నింపుతామని ఎన్నడైనా ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్లి అడిగారా?’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫోరమ్ ఆ ధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ‘కరువు వర్సెస్ కాళేశ్వ రం, కన్నెపల్లి నుంచి నీళ్ల తరలింపు సాధ్యమా? లేదా ప్రభుత్వ వాదన కరెక్టేనా?’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జర్నలిస్టు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో బీఆర్ఎస్ నేతలు, రిటైర్డ్ ఇంజినీర్లను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి అత్యంత అహంకారంతో, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని దిగజారుడు భాషను వాడుతున్నారని ధ్వజమెత్తారు.
‘పదవి ఉన్నదనే అహంకారంతో మాట్లాడితే చూస్తూ ఊరుకోం ఖబర్దార్’ అని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మా ణం కోసం రాత్రింబవళ్లు కష్టపడిన ఇంజినీర్లను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే వెనకి తీసుకొని, వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ కూలిపోయిందని, అన్నారం, సుందిళ్ల పనికిరావని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఆయన ఎన్డీఎస్ఏ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని, ఇకడి రిటైర్డ్ ఇంజినీర్లు, సాగునీటి రంగ నిపుణుల సూచనలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బరాజ్‌తో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చని ఇంజినీర్లు సూచిస్తున్నా సీఎం భేషజాలకు పోతున్నారని, తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేవాదుల వద్ద బరాజ్, డ్యామ్‌లు లేకున్నా వరంగల్ జిల్లా సాగునీరు తాగునీరుకు ఆ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా ఉన్నదని గుర్తుచేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కేవలం రూ.2 కోట్లతో కాఫర్‌డ్యామ్ నిర్మించి జలాలను ఎత్తిపోయవచ్చని చెప్పారు. ఎన్టీపీసీకి, సింగరేణికి, మంచిర్యాల జిల్లా ప్రజల తాగునీటికి కలిపి మొత్తం 10 టీఎంసీల నీరు అవసరమవుతుందని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి ఎకడికైనా ఎన్ని టీఎంసీలనైనా పంపింగ్ చేసుకునే అవకాశం ఉన్నదని వివరించారు.
అనుభవంతో సలహాలు ఇస్తున్నా..
ఇంజినీర్లుగా తమ అనుభవాన్ని ఉపయోగిం చి, కొన్ని సాంకేతిక సూచనలు చేస్తున్నారని, కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని మాజీ ఇంజినీర్, బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో అనుసరిస్తున్న తీరును, సీఎం రేవంత్‌రెడ్డి భాషను ఆయన తప్పుబట్టారు. మేడిగడ్డ బరాజ్‌కు, డ్యామ్‌కు మధ్య ఉన్న సాంకేతిక తేడాలను గుర్తించకుండా ప్రభుత్వం మాట్లాడుతున్నదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లను ఆన్ చేసి, నీటిని ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉన్నదని, అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వానికి బాధ్యత లేదు
కరువు పరిస్థితులు నెలకొన్నా, ప్రజలకు తాగు, సాగునీరు అందించడంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. నిపుణులు, శాస్త్రవేత్తల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, ఎటువంటి ముందుస్తు ప్రణాళికలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. మేడిగడ్డ బరాజ్ గేట్లు దించకుండానే కన్నెపల్లి నుండి నీటిని ఎత్తిపోసి, ఉత్తర తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. రిటైర్డ్ ఇంజినీర్లు దామోదర్‌రెడ్డి, వెంకటేశం, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పాపారావు, వెంకటరామారావు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లన్నీ డెడ్ స్టోరేజీకి చేరాయని చెప్పారు. రాబోయే రోజుల్లో తాగునీటికి, పరిశ్రమలకు నీళ్లు కావాలంటే సీఎం రేవంత్‌రెడ్డి తాము చేసిన సూచనలేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిపుణుల సలహాలు కూడా తీసుకొని నీళ్లను ఎత్తిపోయాలని విజ్ఞప్తిచేశారు. రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసుకునే వెసులుబాటు, అందుకు కావాల్సిన యంత్రాంగమం తా సిద్ధంగా ఉన్నదని గుర్తుచేశారు. గోదావరిలో ప్రాణహిత వద్దనే నీటి లభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ కూడా పేరొన్నదని గుర్తుచేశారు. మేడిగడ్డ నింపితే కూలిపోతుందని, భద్రాచలం మునిగిపోతుందని భయపెట్టే ప్రకటనలు చేస్తున్నారని, ఆ వాదనలు తప్పు అని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గొర్ల బుచ్చన్న, ఏ రమణకుమార్, నర్రా విజయ్, రమణ తదితరులు మాట్లాడారు.
సమావేశంలో ఐదు తీర్మానాలు