హైదరాబాద్, మార్చి26 (నమస్తే తెలంగాణ) : రేషన్‌కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం సహా 9 రకాల నిత్యావసరాల పంపిణీని త్వరలో చేపడుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో మంత్రి మాట్లాడారు. వచ్చే నెలలోనే కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని, ఉగాది పర్వదినం సందర్భంగా సన్నిబియ్యం పంపిణీని సీఎం రేవంత్ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని తెలిపారు.