Errolla Srinivas | ఇండస్ట్రియల్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు, హౌస్ అరెస్టులపై మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత భయం అని ప్రశ్నించారు. అక్రమంగా పేదల భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం.. బాధితులను కలవడానికి వెళ్తుంటే ఇన్ని నిర్బంధాలా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. రైతుల పక్షాన పోరాటం చేస్తే అక్రమ అరెస్టులా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొందన లేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హరీశ్‌రావు అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు.
ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల పాలిట శాపంగా మారుతున్న పాలన అని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీ అవినీతిని బయటపెడుతూనే ఉంటామని హెచ్చరించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్
పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డగింత
ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు
హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీస్ బలగాలు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్… https://t.co/ApC9XTf21H pic.twitter.com/3ANmabd84T
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026