హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయడంపై ఉన్న బాధ్యత కన్నా, బీఆర్ఎస్ అంటేనే సీఎం రేవంత్‌కు భయం ఎక్కువగా ఉందని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ సభ నేపథ్యంలోనే సీఎం రైతు భరోసా ప్రకటించారని తెలిపారు. ఇది రైతు భరోసా ప్రభుత్వం కాదని, ప్రజలకు ఏ భరోసా, నమ్మకాన్ని ఇవ్వని ప్రభుత్వమని విమర్శించారు. ఏ బాధ్యతా లేని ఈ ప్రభుత్వానికి త్వరలోనే రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.