హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ)/చిన్నకోడూరు : బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి విజ్జయ్య గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. విజ్జయ్య ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఎర్రోళ్ల స్వగృహానికి వెళ్లి విజ్జయ్య మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. విజ్జయ్య మృతి బాధాకరమని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, దూదిమెట్ల బాలరాజు, దేవీప్రసాద్, వంటేరు ప్రతాప్‌రెడ్డి, వేలేటి రాధాకృష్ణ, కాముని శ్రీనివాస్ తదితరులు సంతాపం ప్రకటించారు.