వడ్లు కొంటలేరని రైతుల కంటతడి
‘దయన్నా.. వడ్లు కాంటా అయితలే.. రెండు నెలలైనా పట్టించుకునే దిక్కు లేదు.. ఎండలకు ఎండి, వానలకు నానుతున్నం.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్నం.. ఎమ్మెల్యే వస్తలేడు.. అధికారులు పట్టించుకుంటలేరు.. కేసీఆర్ పాలనే బాగుండే.. మళ్లీ మీరే రావాలి.
- దయన్నా.. వడ్లు కాంటా అయితలే!
- వానలొస్తున్నా వడ్లుకొనరా? అంటూ ఆగ్రహం
- రెండు నెలలైనా కొనే దిక్కులేదు
- కేసీఆర్ పాలనే బాగుండే.. మళ్లీ మీరే అధికారంలోకి రావాలి
- మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ చేసిన ఈరవెన్ను రైతులు
- కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల్లో భరోసా నింపిన ఎర్రబెల్లి
- రేవంత్‌రెడ్డికి రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరిక
పాలకుర్తి, జూన్ 7 : ‘దయన్నా.. వడ్లు కాంటా అయితలే.. రెండు నెలలైనా పట్టించుకునే దిక్కు లేదు.. ఎండలకు ఎండి, వానలకు నానుతున్నం.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్నం.. ఎమ్మెల్యే వస్తలేడు.. అధికారులు పట్టించుకుంటలేరు.. కేసీఆర్ పాలనే బాగుండే.. మళ్లీ మీరే రావాలి.. కాంగ్రెస్ పాలనలో రైతులకు చావే శరణ్యం’ అంటూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఫోన్ చేసి ఆవేదన చెందారు. దీంతో స్పందించిన ఎర్రబెల్లి తక్షణమే కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వడ్ల కాంటా కోసం ఎర్రటి ఎండలో రైతులను ఇబ్బందులు పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన చెందారు. ఎరువుల కోసం రైతులు కొన్నాళ్లు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ధాన్యం అమ్మడానికి పడరాని పాట్లు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నాడూ లేనివిధంగా రైతులను ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్ సర్కార్‌కు తగదని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు రైతుల బాధలు పట్టవా? అని మండిపడ్డారు. దమ్ముంటే కొనుగోలు కేంద్రాలకు రావాలని సవాల్ విసిరారు. లారీలు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తరుగు పేరుతో దోపీడీ చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతుల వద్ద కాంటా కోసం పైసలు వసూలు చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు పూర్తికాకుంటే రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

