దేవరుప్పుల/తొర్రూరు/పాలకుర్తి, మే 2: రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పండించిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి రైతులు నిరీక్షిస్తున్నారని పేర్కొన్నారు.
శనివారం జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండల కేంద్రాలతోపాటు మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 6న హనుమకొండ హంటర్ రోడ్డులో రైతు సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 30 వేల మంది రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని తెలిపారు.