హసన్‌పర్తి, ఆగస్టు 22 : ఎరువుల సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పీఏసీఎస్ వద్ద శుక్రవారం ఉద యం 3 గంటల నుంచి రైతులు పడిగాపులు కాస్తూ విసిగెత్తి ఎర్రబెల్లికి ఫోన్‌చేసి వారి బాధలను వెల్లబుచ్చుకున్నారు. వెంటనే స్పందించిన దయాకర్‌రావు హసన్‌పర్తి పీఏసీఎస్ గోదాంకు వచ్చి సమస్యలు తెలుసుకున్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి (ఏడీఏ) ఆదిరెడ్డికి ఫోన్ చేసి వారం రోజుల నుంచి రైతులు తిండి, తిప్పలు మానేసి గోదాం చుట్టూ తిరిగినా యూరియా అందడం లేదని, తక్షణమే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సందర్భగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో రాజులా బతికిన రైతులు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో రాత్రనక, పగలనక గోదాంల చుట్టూ తిరిగి విసిగి పోతున్నారని తెలిపారు.