వర్ధన్నపేట, నవంబర్ 10 : ఆర్థిక ఇబ్బందులతో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ పూర్తిగా ప్రభుత హత్యలేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రతండాలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు బానోత్ మైబూనాయక్ కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మైబూనాయక్ తనకున్న కొద్దిపాటి భూమితోపాటుగా మరో పది ఎకరాలు కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.
తేమశాతం లేదని పత్తిని, వరి ధాన్యాన్ని ఇంతవరకు కొనుగోలు చేయకపోవడం దారుణమని అన్నారు. దీనికితోడు రైతుబంధు, రైతుబీమా, గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇవన్నీ ప్రభుత్వం, సీఎం రేవత్రెడ్డి చేసిన హత్యలుగానే భావిస్తున్నామని పేర్కొన్నారు. గర్మిళ్లపల్లిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కల్యాణలక్ష్మి చెక్కు ఇస్తుంటే ఓ మహిళ తులం బంగారం ఏదని నిలదీయ డం జరిగిందని గుర్తుచేశారు. రానున్న రోజు ల్లో ప్రజలు ప్రభుత్వ నేతలను గ్రామాల్లో తిరగనివ్వరని అన్నారు. మైబూనాయక్కు రూ. 25 లక్షల వరకు అప్పులు అయినందున ప్ర భుత్వం వెంటనే అతడి కుటుంబ సభ్యులకు పరిహారం అందించడంతోపాటుగా ఆయన పిల్లల చదువు బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.