పెద్దవంగర, ఫిబ్రవరి 8 : తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆశాబావం వ్యక్తంచేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యనాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి రాక్షస పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో తొర్రూరు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. తెలంగాణ తొ లి సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్ని విధాలా అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. గడిచిన రెండేండ్లలో స్థానిక ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టడం తప్ప, ఏ ఒక్క అభివృద్ధి పనిని ప్రారంభించలేదని పేర్కొన్నారు. సమావేశంలో రామచంద్ర శర్మ, సోమ నర్సింహారెడ్డి, సంజయ్, సునీల్‌రెడ్డి, సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిసున్నదని వామపక్ష పార్టీలు విమర్శించాయి. ఈ మేరకు ఆదివారం వామపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మోదీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వీబీజీ-రామ్‌జీ చట్టం లాంటి ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఈనెల 12న జరుప తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని వెల్లడించాయి. రాష్ట్రంలోని కార్మికులు ఈ సమ్మెలో పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి. కొత్త చట్టాల వల్ల కార్మికులు ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ-పెన్షన్ వంటి సామాజిక భద్రతకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశాయి. సార్వత్రిక సమ్మెకు కార్మికులు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయని తెలిపాయి.