హైదరాబాద్ : అకాల వర్షాలకు(Rains) తడిసిన ధాన్యాన్ని(Stained grain) ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Errabelli Dayakar Rao) డిమాండ్ చేశారు. ఆదివారం జనగామా జిల్లా(Janagama) పాలకుర్తి మండలంలోని విస్నూర్, తొర్రూరు గ్రామాల్లో పర్యటించారు తడిసిన కల్లాల్లో తడిసిన ధన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పంటలు పండిస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వహరిస్తుందని మండిపడ్డారు. వడ్లు కొనకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వడ్లు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. లేదంటే అన్నదాతలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.